Young Man Committed Suicide In Warangal, Deets Inside - Sakshi
Sakshi News home page

8న ఎంగేజ్‌మెంట్‌.. అంతలోనే ...

May 4 2023 8:15 AM | Updated on May 4 2023 9:31 AM

Young Man Committed Suicide in Warangal - Sakshi

హైదరాబాద్: ఈనెల 8న అతడికి ఎంగేజ్‌మెంట్‌. అంతలోనే ఆయువకుడు జీవితంపై విరక్తి పుడుతోందని ఉరేసుకున్నాడు. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గోనె లెనిన్‌రెడ్డి(30) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. లెనిన్‌ డిగ్రీ చదివి కరీంనగర్‌లో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 8న అతడికి ఎంగేజ్‌మెంట్‌ ఉంది. దీంతో లెనిన్‌ మంగళవారమే ఇంటికి వచ్చాడు.

బుధవారం మధ్యాహ్నం తన తల్లి పద్మను ఫంక్షన్‌ కోసం గిర్నిబావికి తీసుకెళ్లాడు. అనంతరం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. స్థానికులు తలుపులు బలవంతంగా తొలగించి చూడగా.. అప్పటికే లెనిన్‌ మృతి చెందాడు. మృతుడి తండ్రి 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. సోదరుడు మల్లారెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ‘జీవితంపై విరక్తి కలుగుతోంది. చావాలని అనిపిస్తోంది. అమ్మను బాగా చూసుకో అన్నయ్య’ అని రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై నవీన్‌కుమార్‌ మృతదేహాన్ని నర్సంపేట మార్చురీకి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement