మహిళా దొంగల హల్‌చల్‌.. పట్టపగలే బట్టల దుకాణంలో చోరీ | Woman Thief halchal At Mahabubabad Caught On Ca,era | Sakshi
Sakshi News home page

మహిళా దొంగల హల్‌చల్‌.. పట్టపగలే చోరీ.. సీసీటీవీలో పట్టుబడ్డ వైనం

Sep 1 2023 6:49 PM | Updated on Sep 1 2023 7:27 PM

Woman Thief halchal At Mahabubabad Caught On Ca,era - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పట్టపగలు మహిళా దొంగలు హల్చల్ చేశారు. బట్టల దుకాణంలోకి కస్టమర్‌ల  మాదిరిగా ప్రవేశించిన నలుగురు మహిళలు చీరల చోరీకి పాల్పడ్డారు. యాజమాని పవన్ కన్నుగప్పి 20 వేల రుపాయల విలువ చేసే చీరలు అపహరించారు. కిలేడీల చోరీ బాగోతం పీపీ కెమెరాలో రికార్డు అయింది.

సీసీ పుటేజ్ ఆధారంగా ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు షాప్ నిర్వాహకులు. మరో ముగ్గురు పారిపోగా. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అయిదుగురు మహిళలు గుంటూరు నుంచి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. కొత్తగూడ లో శుక్రవారం అంగడి కావడంతో సందడిగా మారిన షాప్‌లో చోరీకి యత్నించిన మహిళా చోరులు.. నిఘా కళ్ళతో అడ్డంగా బుక్కయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement