తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా | Telangana Health Director Srinivasa Rao Tests Corona Positive | Sakshi
Sakshi News home page

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా

Jan 18 2022 5:12 PM | Updated on Jan 18 2022 7:16 PM

Telangana Health Director Srinivasa Rao Tests Corona Positive - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా వైరస్‌ సోకింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్లు ఆయన వెల్లడించారు.

గాంధీ ఆస్ప్రత్రిలో 120 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఉస్మానియా పరిధిలో 159 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదిలాబాద్‌ రిమ్స్‌లో 73 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. 

Advertisement
 
Advertisement
Advertisement