జీహెచ్‌ఎంసీలో హౌజింగ్‌ సొసైటీలపై సుప్రీం సంచలన తీర్పు | Supreme Court Judgement On Housing Societies In Ghmc Area | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీలో హౌజింగ్‌ సొసైటీలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Nov 25 2024 11:25 AM | Updated on Nov 25 2024 12:32 PM

Supreme Court Judgement On Housing Societies In Ghmc Area

సాక్షి,ఢిల్లీ: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధిలో హౌసింగ్ సొసైటీలపై సుప్రీంకోర్టు సోమవారం(నవంబర్‌ 25) సంచలన తీర్పిచ్చింది. హౌజింగ్‌ సొసైటీలకు ఇప్పటికే చేసిన భూ కేటాయింపులను సీజేఐ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. ఇంతేకాకుండా సొసైటీలు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా  తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

హౌజింగ్‌ సొసైటీలకు ప్రభుత్వ భూ కేటాయింపులను సవాలు చేస్తూ రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ ఉద్యోగులు,జర్నలిస్టుల సొసైటీలకు ప్రభుత్వంలో గతంలో భూ కేటాయింపులు జరిపింది. 

GHMC పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు

ఇదీ చదవండి: సోషల్‌మీడియా అండతో తీర్పులను ప్రభావితం చేసే యత్నాలు 
 

Advertisement
 
Advertisement
Advertisement