పంచాయతీ భవనమే ఇల్లు | Siddipet Former Sarpanch Indiramma Illu | Sakshi
Sakshi News home page

పంచాయతీ భవనమే ఇల్లు

Jun 21 2025 8:34 AM | Updated on Jun 21 2025 8:34 AM

Siddipet Former Sarpanch Indiramma Illu

 మాజీ సర్పంచ్‌కు దక్కని ఇందిరమ్మ ఇల్లు 

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): ఆమె గత స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవ సర్పంచ్‌.. ఉన్న పెంకుటిల్లు కూలిపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలోనే కుటుంబంతో తలదాచుకుంటోంది. ఇందిరమ్మ ఇల్లు వస్తదని అనుకుంటే నిరాశే మిగిలింది. వివరాల్లోకి వెళితే... సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని అనంతసాగర్‌ గ్రామానికి దండు లావణ్యమల్లేశం 2019 స్థానిక ఎన్నికల్లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తనకున్న అర ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ పెంకుటిల్లులోనే నివాసముంటున్నారు. ఏడాదిన్నర క్రితం వర్షాలకు పెంకుటిల్లు కూలిపోగా, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలోనే నివాసం ఉంటున్నారు. ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. తాను బీఆర్‌ఎస్‌ మాజీ సర్పంచ్‌ను కాబట్టే ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన బిల్లులు రూ. 4లక్షల వరకు రావాలని వాపోయారు.  

Advertisement
 
Advertisement
Advertisement