GHMC: మేయర్‌ విజయలక్ష్మి ఇంట్లో చొరబడిన రౌడీషీటర్‌.. | Rowdy Sheeter Laxman Enters Into GHMC Mayor Vijayalakshmi's House | Sakshi
Sakshi News home page

GHMC: మేయర్‌ విజయలక్ష్మి ఇంట్లో చొరబడిన రౌడీషీటర్‌..

May 2 2024 11:18 AM | Updated on May 2 2024 11:29 AM

Rowdy Sheeter Laxman Enters Into GHMC Mayor Vijayalakshmi's House

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్ఎంసీ మేయర్  గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి ఓ రౌడీ షీటర్‌ చొరబడటం తీవ్ర కలకలం సృష్టించింది. సదరు వ్యక్తి నేరుగా మేయర్‌ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం, పోలీసులు మేయర్‌ ఇంటికి వచ్చిన రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన రౌడీ షీటర్‌ లక్ష్మణ్‌ మంగళవారం మేయర్‌ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడ్డాడు. నేరుగా వచ్చి ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె సిబ్బంది అడ్డుకున్నారు. సిబ్బంది వారించినా అతను పట్టించుకోలేదు. దీంతో, అతడిని సిబ్బంది అడ్డుకుని బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఇక, ఆ సమయంలో మేయర్‌ ఇంట్లో లేరు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, లక్ష్మణ్‌కు మతిస్థిమితం సరిగా లేనట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. లక్ష్మణ్‌ గత రెండు రోజులుగా మేయర్‌ ఇంటి చుట్టే తిరిగినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement