టీఆర్‌ఎస్‌ నేతల అత్యుత్సాహం.. జారిపడిన లిఫ్ట్.. | Over Weight: Lift Collapse Tragedy In Hyderabad | Sakshi
Sakshi News home page

టీటీఆర్‌ఎస్‌ నేతల అత్యుత్సాహం.. జారిపడిన లిఫ్ట్..

Nov 15 2021 11:04 AM | Updated on Nov 15 2021 11:06 AM

Over Weight: Lift Collapse Tragedy In Hyderabad - Sakshi

సాక్షి, శంషాబాద్‌(హైదరాబాద్‌): టీఆర్‌ఎస్‌ నేతల అత్యుత్సాహం ఓ ప్రమాదానికి కారణమైంది. పట్టణంలోని అర్కాన్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిని ప్రారంభించేందుకు వైద్యశాఖ మంత్రి హరీష్‌రావుతో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

కార్యక్రమానికి హాజరైన స్థానిక నేతలు పైకి వెళ్లేందుకు లిఫ్టు ఎక్కారు. గరిష్ఠంగా ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్టులో పదిహేను మందికి పైగా ఎక్కడంతో  ఒక్కసారిగా పైకి లేచి కిందపడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది లిఫ్టు నుంచి అందరికి బయటికి తీశారు.

రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ కూడా లిఫ్టులో వెళదామనుకున్నప్పటికి అప్పటికే లిఫ్టులో ఎక్కువమంది  ఉండడంతో మెట్లు ఎక్కి పైకి పైకి వెళ్లారు.  ముఖ్యనేతలు తాము అందులో ఎక్కక్కపోవడమే మంచిదైందని అనుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement