సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు | Narendra Modi Congratulations To Telangana CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Dec 7 2023 2:42 PM | Updated on Dec 7 2023 2:48 PM

Narendra Modi Congratulations To Telangana CM Revanth Reddy - Sakshi

సాక్షి​, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డికి.. ప్రధాని మంత్రి నరే​ద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తాడని తాను హామీ ఇస్తున్నానని’ ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో తెలిపారు.

ఇక.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మిగతా మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో  ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement