"కేసీఆర్ కో అంటే కోల్‌బెల్ట్‌ మెుత్తం కదిలింది" | KTR criticizes Congress government on Godavari khani | Sakshi
Sakshi News home page

"కేసీఆర్ కో అంటే కోల్‌బెల్ట్‌ మెుత్తం కదిలింది"

Oct 14 2026 8:18 PM | Updated on Oct 14 2026 8:26 PM

KTR criticizes Congress government on Godavari khani

సాక్షి, గోదావరి ఖని: రాష్ట్రంలో రైతులు వలవల ఏడ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. ఈ రోజు బుధవారం గోదావరి ఖనిలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జనలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారం ఇస్తే తెలంగాణ అంధకారమవుతుందని కేసీఆర్ గతంలోనే చెప్పారని ప్రస్తుతం అవే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. విద్యుత్ వ్యవస్థను రేవంత్ ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు.

థర్మల్‌ ప్లాంట్లకు సింగరేణి బొగ్గు ఎందుకు ఇవ్వడం లేదని సింగరేణి బొగ్గు అంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి సరిగ్గా లేదంటే దానికి కారణం ప్రభుత్వమేనన్నారు. ఉద్యమంలో కేసీఆర్‌ కో అంటే కోల్‌బెల్ట్‌ మెుత్తం కదలిందని ఉత్పత్తి ఉద్యమాల్లో మెునగాళ్లు సింగరేణి కార్మికులన్నారు. కేసీఆర్‌ హయాంలో సింగరేణి ఓ వెలుగు వెలిగిందని ఈ సంస్థ సాయంతోనే రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇవ్వగలిగామన్నారు.

తెలంగాణకు రావాల్సిన 500 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును గతంలో ఆంధ్ర ప్రాంతానికి తరలించారు. ప్రధాని మోదీ, చంద్రబాబు కలిసి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రాంతానికి తరలించారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని సింగరేణి కార్మికుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని పిలుపుతెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులది కీలక పాత్రసింగరేణి కార్మికుల పోరాట స్ఫూర్తి, ఉద్యమ చైతన్యం అభినందనీయమన్నారు.

ఈ మూడేళ్ల కాంగ్రెస్‌ పాలనలో కరెంటు ఆగమైందని మోసపోతే గొసపడతామని కేసీఆర్ ఆనాడే చెప్పారన్నారు. సింగరేణిని అవినీతి గనిగా రేవంత్ మారుస్తున్నారు. సింగరేణి కార్మికుల వల్లే విద్యుత్‌ వెలుగులు వెలిగాయన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కరెంటు కొరత లేదు ఇప్పుడు రాష్ట్రంలో కరెంట్ కట్ సాధారణంగా మారిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి రైజింగ్.. ప్రొడక్షన్ పాలింగ్ అన్న చందంగా పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement