17వ అంతస్తు నుంచి దూకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య | ISB professor ends life at Hyderabad campus flat | Sakshi
Sakshi News home page

17వ అంతస్తు నుంచి దూకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

Jun 26 2025 11:40 AM | Updated on Jun 26 2025 12:05 PM

ISB professor ends life at Hyderabad campus flat

హైదరాబాద్: అసిస్టెంట్ ప్రొఫెసర్ 17వ అంతస్తు బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన నిఖిల్ మదన్ (37)కు తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. ఆయన భార్య ప్రేరణ టీవీ చూస్తుండగా తాను ఉంటున్న 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకాడు. 

తీవ్ర గాయాలతో నిఖిల్ మదన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మానసిక కుంగుబాటుకు చికిత్స తీసుకుంటున్న నిఖిల్ మదన్.. అదే అతని ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement