దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక హెచ్చరిక చేశారు. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాల్సిన తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను దసరా వేళ కొందరు స్వార్థం కోసం ఇనుప బోనుల్లో బంధించడం, ఇబ్బందులకు గురి చేయడం నేరమని స్పష్టం చేశారు. అంతే కాదు వన్యప్రాణులకు హాని తలపెట్టే ఘటనలు ఎక్కడ కనిపించినా వెంటనే 18004255364, 9803338666 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలి, లేదా డయల్ 112 కు సమాచారం అందించి బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని కోరుతూ ట్వీట్ చేయడం విశేషంగా నిలిచింది.
ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాల్సిన తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను దసరా వేళ కొందరు స్వార్థం కోసం ఇనుప బోనుల్లో బంధించారు. మూగజీవులను హింసిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని మేం ముందుగానే స్పష్టంగా హెచ్చరించినప్పటికీ.. కొందరు పెడచెవిన పెట్టి ఆ నిస్సహాయ పక్షులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అప్రమత్తమైన పౌరుల నుంచి అందిన పక్కా సమాచారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు తక్షణమే స్పందించి, మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిపి మొత్తం 4 పాలపిట్టలను ప్రాణాలతో కాపాడారు. లంగర్‌హౌస్ బాపుఘాట్ సమీపంలోని ఆలయం వద్ద ఇరుకైన బోనుల్లో నరకయాతన అనుభవిస్తున్న రెండు పాలపిట్టలను విడిపించి కేబీఆర్ పార్క్ అటవీ అధికారులకు అప్పగించగా.. ఛత్రినాక శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం వద్ద చెట్టుకు బోను వేలాడదీసి నిర్బంధించిన ఒక పాలపిట్టను, అలాగే మంగళహాట్ బాలాజీనగర్ గుడి సమీపంలో బోనులో ఉంచిన మరో పాలపిట్టను రెస్క్యూ చేసి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. బాధ్యులపై అటవీశాఖ సమన్వయంతో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పండుగ పేరుతో ఒక నిస్సహాయ పక్షిని బంధించి, ఆహార నీళ్లు లేకుండా చిత్రహింసలకు గురిచేసి చూడటం ఎవరికీ మంచి చేయదు.. ఇది మన సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రాణభయంతో బోను చువ్వల మధ్య విలవిల్లాడుతున్న పక్షి రోదనలో శుభం ఎలా కనిపిస్తుంది? నిజమైన భక్తి అంటే జీవకారుణ్యమే తప్ప, ప్రకృతిని బందీ చేయడం కాదు! మూగప్రాణుల స్వేచ్ఛను హరిస్తూ, కాసుల వేటకు తెరలేపే ఇలాంటి అమానవీయ పోకడలను ఎవరూ ప్రోత్సహించవద్దు. వన్యప్రాణులకు హాని తలపెట్టే ఘటనలు ఎక్కడ కనిపించినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112 కు సమాచారం అందించి బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని కోరుతున్నాం.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) October 21, 2026
పాలపిట్టను బోనుల్లో బంధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినప్పటికీ, దసరా సమయంలో కొందరు ఆ పక్షిని ఇనుప బోనుల్లో బంధించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. జంతువులకు, పక్షులకు హాని తలపెట్టేవారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ గతంలోనే స్పష్టంగా హెచ్చరించారు. అప్రమత్తంగా ఉన్న పౌరుల నుండి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ నగర పోలీసులు వెంటనే స్పందించి, మూడు వేర్వేరు ప్రాంతాలపై దాడులు చేసి నాలుగు పక్షులను రక్షించారు. వాటిని అటవీ అధికారులకు అప్పగించారు.
"పండుగ పేరుతో నిస్సహాయ పక్షిని బంధించి, దానికి ఆహారం, నీరు లేకుండా చేసి, హింసించడం వల్ల ఎవరికీ మంచి జరగదు. ఇది మన సమాజానికి మంచిది కాదు," అని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ 'ఎక్స్'లో పంచుకున్న ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. "కేవలం డబ్బు కోసం పంజరం కడ్డీల మధ్య భయంతో విలవిలలాడుతున్న పక్షి అరుపులలో ఎవరైనా ఎలా శుభాన్ని చూడగలరు? నిజమైన భక్తి అంటే జీవుల పట్ల కరుణ కలిగి ఉండటమే తప్ప, ప్రకృతిని బంధించడం కాదు," అని ఆయన పేర్కొన్నారు..


