పోటీపడ్డ 138 దేశాలు.. CP సీవీ ఆనంద్‌కే అవార్డు | Hyderabad CP CV Anand Gets International Award | Sakshi
Sakshi News home page

పోటీపడ్డ 138 దేశాలు.. CP సీవీ ఆనంద్‌కే అవార్డు

May 6 2025 9:35 PM | Updated on May 6 2025 9:57 PM

Hyderabad CP CV Anand Gets International Award

హైదరాబాద్:  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ పోలీస్ విభాగాల్ని వెనక్కి నెట్టి మరీ అంతర్జాతీయ అవార్డు దక్కించుకున్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.  డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించిన సీవీ ఆనంద్.. ఎక్స్ లెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. దుబాయ్ జరుగుతున్న అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్ లో భాగంగా ఈ అవార్డుకు సీవీ ఆనంద్ ఎంపికయ్యారు.  

ఈ అవార్డు కోసం 138 దేశాలు పోటీపడగా, సీవీ ఆనంద్ కే ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును మే 15వ తేదీ న దుబాయ్ లో సీపీ సీవీ ఆనంద్ అందుకోనున్నారు. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ఈడీ, ఎన్ సీఆర్బీ, డీఆర్ఐ, ఎక్స్ సైజ్, ఆర్ఆర్ఓ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలతో సమన్వయం చేస్తున్న చర్యలను సీపీ సీవీ ఆనంద్ ఆన్ లైన్ వేదికగా వివరించారు.

మత్తుకు బానిసలైన వారిని మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. దీని అవగాహన కోసం చేపడుతున్న చర్యలను సైతం వివరించారు. దానికి సంబంధించి ఫలితాలను కూడా అంతర్జాతీయ వేదిక ముందుపెట్టారు. వీటన్నింటిని పరిశీలించిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ ప్రతినిధులు  ఎక్స్ లెన్స్ ఇన్ యాంటీ నారకోటిక్స్ అవార్డుకు సీవీ ఆనంద్ ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement