Hyderabad: Banjara Hills SI Heroic Act Saved 16 Members Life - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: హోంగార్డుకు ఫిట్స్‌.. ఎస్సై సార్‌ సాహసం.. ప్రాణాలకు తెగించి 16 మందిని కాపాడారు

Mar 21 2023 4:46 PM | Updated on Mar 21 2023 7:16 PM

Hyderabad Banjara Hills SI Heroic Act Saved 16 Members Life - Sakshi

డీసీఎం డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతో.. అదుపు తప్పగా.. 

సాక్షి, హైదరాబాద్‌: మనిషికి సమయస్ఫూర్తితో పాటు ధైర్యసాహసాలు కూడా అవసరమే!. తన ప్రాణాలకు తెగించి మరీ ఇక్కడో ఎస్సై సార్‌.. పదహారు మంది ప్రాణాలను కాపాడారు. రియల్‌ హీరో అనిపించుకున్నారు. 

మంగళవారం ప్రగతి భవన్‌ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుని అరెస్ట్‌ చేశారు పోలీసులు. పదహారు మందిని డీసీఎంలో తరలిస్తుండగా.. ఖైరతాబాద్‌ వైపు వచ్చే వాహనం నడుపుతున్న హోంగార్డు రమేష్‌కు ఫిట్స్‌ వచ్చింది. దీంతో వాహనం అదుపు తప్పి.. డివైడర్‌ మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో డీసీఎంలో ఉన్న బంజారాహిల్స్‌ ఎస్సై కరుణాకర్‌ రెడ్డి అప్రమత్తం అయ్యారు.

కిందకు దూకి ప్రాణాలకు తెగించి వాహనాన్ని కంట్రోల్ చేశారు. ఈ క్రమంలో ఆయనకు, మరో కానిస్టేబుల్‌ సాయి కుమార్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. ఎస్సై సార్‌ సాహసంతో 16 మంది ప్రమాదం నుంచి బయటపడగా.. గాయపడిన ఎస్సై కరుణాకర్‌ను, రమేష్‌ను ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement