ఎస్సై, కానిస్టేబుల్‌ ఫిజికల్, మెయిన్స్‌కు ఉచిత కోచింగ్‌  | Free Coaching For SI Constable Physical And Mains Exams In Telangana | Sakshi
Sakshi News home page

ఎస్సై, కానిస్టేబుల్‌ ఫిజికల్, మెయిన్స్‌కు ఉచిత కోచింగ్‌ 

Oct 26 2022 1:10 AM | Updated on Oct 26 2022 1:10 AM

Free Coaching For SI Constable Physical And Mains Exams In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షలో బీసీ స్టడీ సర్కిల్స్‌లో కోచింగ్‌ తీసుకున్న 1237 మంది అభ్యర్థులు అర్హత సాధించారని టీఎస్‌బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ కె.అలోక్‌ కుమార్‌ తెలిపారు. వారికి ఫిజికల్, మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ కోసం వచ్చే నెల 2 నుంచి ఉచిత కోచింగ్‌ ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 15 స్టడీ సర్కిళ్లుండగా.. హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం స్టడీ సర్కిళ్లలో 250 మందికి, మిగతా సర్కిళ్లల్లో 100 మందికి 90 రోజులపాటు కోచింగ్‌ ఇవ్వనున్నా రు.

ప్రిలిమ్స్‌కు అర్హత సాధించి, స్టడీ సర్కిల్‌లో కోచింగ్‌ తీసుకోని అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. మెరిట్, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికలు జరుగుతాయని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశం పొందిన అభ్యర్థులందరికీ స్టడీ మెటీరియల్‌ కూడా అందజేస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement