సాక్షి, మిర్యాలగూడ: ఇస్లాంపూర్ కాలనీలో చెప్పుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు పెద్దఎత్తున వ్యాపించడంతో గోదాంలో నలుగురు కార్మికులు చిక్కుకున్నారు. దీంతో వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గోదాంలో చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా రక్షించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: ప్రాణంతీసిన రీల్స్ సరదా


