పారా అథ్లెట్ దీప్తికి సీఎం రేవంత్‌ భారీ నజరానా | CM Revanth Gave Gift To Para Athlete Deepthi Jeevanji | Sakshi
Sakshi News home page

పారా అథ్లెట్ దీప్తికి సీఎం రేవంత్‌ భారీ నజరానా

Sep 7 2024 7:34 PM | Updated on Sep 8 2024 12:36 PM

CM Revanth Gave Gift To Para Athlete Deepthi Jeevanji

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వరంగల్‌కు చెందిన పారా అథ్లెట్ దీప్తి జీవన్‌ జీ.. పారిస్‌లో జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో సత్తా చాటారు. మహిళల 400 మీటర్ల టీ20 క్లాస్‌లో దీప్తి కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో అథ్లెట్ దీప్తికి సీఎం రేవంత్ రెడ్డి భారీ నజరానా ప్రకటించారు.

ఒలంపిక్స్‌లో సత్తా చాటినందుకు గాను దీప్తికి రూ. కోటి నగదుతో పాటు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌ తెలిపారు. అలాగే, దీప్తి కోచ్‌కు రూ. 10 లక్షల నజరానా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని పారా గేమ్స్ క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement