ఫేక్‌ వీడియో: బీజేపీ నేతపై కేసు | Case Filed On Dubbaka BJP Leader | Sakshi
Sakshi News home page

ఫేక్‌ వీడియో: దుబ్బాక బీజేపీ నేతపై కేసు

Oct 18 2020 8:51 PM | Updated on Oct 18 2020 9:01 PM

Case Filed On Dubbaka BJP Leader - Sakshi

సాక్షి, సిద్దిపేట : సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న దుబ్బాక బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ దిమ్మెల కూల్చివేతకు సంబంధించిన పాత వీడియోలను తాజా వీడియోలుగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన స్థానిక నేత శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. దుబ్బాక రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియా ద్వారా ఇలాంటి అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం రిటర్నింగ్ అధికారి చెన్నయ్య హెచ్చరించారు.

కాగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన దిమ్మెలను ఆ పార్టీ నేతలే కూల్చుతున్నారంటూ శ్రీనివాస్‌ ఓ వీడియోను షేర్‌ చేశారు. దీనిపై టీఆర్‌ఎస్‌ నేతలు అది పాత వీడియో అని, ఎన్నికల సమయంలో ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన చెన్నయ్య బీజేపీ నేత బెన్నయ్యపై పోలీసులు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement