HYD: కోకాపేటలో బ్లాస్టింగ్‌ కలకలం | Blasting At Kokapeta Construction Site In Hyderabad | Sakshi
Sakshi News home page

HYD: కోకాపేటలో బ్లాస్టింగ్‌ కలకలం..ఎగిరిపడ్డ బండరాళ్లు

Dec 20 2024 6:20 PM | Updated on Dec 20 2024 7:25 PM

Blasting At Kokapeta Construction Site In Hyderabad

సాక్షి,హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కోకాపేటలో శుక్రవారం(డిసెంబర్‌20) బ్లాస్టింగ్‌ కలకలం రేపింది. కోకాపేటలోని నియోపోలిస్‌ వెంచర్‌ వద్ద నిర్మాణ సంస్థ బ్లాస్టింగ్‌ నిర్వహించింది. ఈ బ్లాస్టింగ్‌ తీవ్రతతో బండరాళ్లు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడ్డాయి. రాళ్లను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు పరుగులు తీశారు. రాళ్లు పక్కనే ఉన్న అయ్యప్పస్వాముల శిబిరంపై పడ్డాయి.

కాగా, కోకాపేటలోని నియోపోలిస్‌ వెంచర్‌ అత్యధిక  ధరకు ప్రభుత్వం గతంలో అమ్మిన విషయం తెలిసిందే. ఇక్కడ భూములు కొనుక్కున్న కంపెనీలు నిర్మాణం ప్రారంభించాయి. ఈ నిర్మాణ ప్రక్రియలో భాగంగానే నిర్మాణ సంస్థ బ్లాస్టింగ్‌ చేపట్టినట్లు సమాచారం. 

రంగారెడ్డి జిల్లా కోకాపేట్ లో బ్లాస్టింగ్స్ కలకలం

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement