బహదూర్‌పురా: 18 నెలల చిన్నారి కిడ్నాప్‌ కేసు సుఖాంతం | Bahadurpura Police Cahes 18 Month Old baby Kidnap Case | Sakshi
Sakshi News home page

బహదూర్‌పురా: 18 నెలల చిన్నారి కిడ్నాప్‌ కేసు సుఖాంతం

Dec 26 2023 2:10 PM | Updated on Dec 26 2023 3:33 PM

Bahadurpura Police Cahes 18 Month Old baby Kidnap Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బహుదూర్‌పురా పీఎస్‌ పరిధిలోని కిషన్‌బాగ్‌లో సోమవారం ఏడాదిన్నర వయసున్న చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. పాపను ఓ మహిళ అపహరించి తీసుకెళ్లుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఆధారంగా 24 గంటల వ్యవధిలోనే పసికందు ఆచూకీని బహదూర్‌పురా పోలీసులు కనుగొన్నారు. 

ఫిర్యాదు ఇచ్చిన నాలుగు గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించారు. కిడ్నాప్‌ చేసిన మహిళను అరెస్ట్‌ చేశారు. చిన్నారిని  తల్లిదండ్రులకు పోలీసుల అప్పగించారు. తన కొడుకుకి 8 ఏళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతో మహిళ.. పాపను కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement