తిరువళ్లూరు జిల్లాలో పది పరీక్షల్లో 86.52 శాతం | Sakshi
Sakshi News home page

తిరువళ్లూరు జిల్లాలో పది పరీక్షల్లో 86.52 శాతం

Published Sat, May 11 2024 7:30 AM

తిరువ

తిరువళ్లూరు: రాష్ట్రంలో శుక్రవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా 86.52 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాఽధించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా 429 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ మహోన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలలకు చెందిన 16,320 మంది బాలురు, 16,191 మంది బాలికలు మొత్తం 32,511 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరయ్యారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో 13,467 మంది బాలురలు, 14,662 మంది బాలికలు మొత్తం 28,129 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 90.56 శాతం, బాలురలు 82.05 శాతం మంది మొత్తం 86.52 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు కలెక్టర్‌ డాక్టర్‌ ప్రభుశంకర్‌ తెలిపారు. కాగా ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ఇంగ్లీషులో ముగ్గురు, లెక్కలు 715 మంది, సైన్సులో 128 మంది, సోషల్‌లో 162 మంది వందకు వంద మార్కులు సాధించారు.

రెండుశాతం తగ్గిన ఫలితాలు

ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే 2022లో 86.97శాతం మంది, 2023లో 88.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 2024లో 90 శాతం ఉత్తీర్ణత సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా గత ఏడాది కంటే 2.28 శాతం తగ్గి, 86.52 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా గత 13 ఏళ్లు పూండీ యూనియన్‌లోని సెండ్రాన్‌పాల్యం ప్రభుత్వ మహోన్నత పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం

సేవాలయలో 97 శాతం మంది ఉత్తీర్ణత

తిరువళ్లూరు: సేవాలయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాకవి భారతీయార్‌ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు 97 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. తిరువళ్లూరు జిల్లా కసువ గ్రామంలో సేవాలయ స్వచ్ఛంద సంస్థ ఉంది. ఈ సంస్థలో సుమారు 2,500 మందికి ఉచితంగా విధ్యను అందిస్తున్నారు. కాగా పదవ తరగతి పరీక్షలకు 132 మంది హాజరుకాగా 128 మంది ఉత్తీర్ణత సాధించారు. పాఠశాలకు చెందిన విలాసిని 476 మార్కులు, గీతలక్ష్మి 469 మార్కులు, వేల్‌మురుగన్‌ 465 మార్కులు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. కాగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు మురళీధరన్‌, ప్రధానోపాధ్యాయుడు కింగ్‌స్టన్‌, ఎంటి ఆనందన్‌ తదితరులు అభినందించారు.

తిరువళ్లూరు జిల్లాలో పది పరీక్షల్లో 86.52 శాతం
1/1

తిరువళ్లూరు జిల్లాలో పది పరీక్షల్లో 86.52 శాతం

Advertisement
 
Advertisement
 
Advertisement