ఒకే నెలలో విశ్వనటుడి 2 చిత్రాలు విడుదల | Sakshi
Sakshi News home page

ఒకే నెలలో విశ్వనటుడి 2 చిత్రాలు విడుదల

Published Tue, Apr 23 2024 8:30 AM

ఇండియన్‌ –2 చిత్రంలో కమలహాసన్‌  - Sakshi

తమిళసినిమా: వైవి ధ్యానికి కేరాఫ్‌ కమలహాసన్‌ చిత్రాలు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఎలాంటి పాత్రకైనా తనదైన శైలిలో జీవం పోసే ఈ విశ్వనటుడు విక్రమ్‌ చిత్రంతో బాక్సాఫీస్‌ హిట్‌ ఇచ్చారు. అయితే ఆ చిత్రం 2022లో విడుదలైంది. ఆ తరువాత కమలహాసన్‌ నటించిన చిత్రాలేవీ తెరపైకి రాలేదు. అయితే ఆయన మాత్రం క్షణం కూడా ఖాళీగా లేరు. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఇండియన్‌ 2 చిత్రాన్ని పూర్తి చేశారు. అలాగే తెలుగులో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న కల్కీ 2898 చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ముఖ్య పాత్రను పోషించడం విశేషం. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో థగ్‌ లైఫ్‌ చిత్రంలో నటిస్తూనే మరో పక్క రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌ కథానాయకుడిగా నటించిన ఇండియన్‌ –2 చిత్రంలో నటి కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ఫ్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీశంకర్‌, సిద్ధార్థ్‌, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయనున్నట్లు యూనిట్‌ వర్గాలు వెల్లడించారు. ఇక కల్కీ 2898 చిత్రం కూడా అదే నెలలో తెరపైకి రానుంది. భారీ అంచనాలు నెలకొన్న రెండు చిత్రాలు ఒకే నెలలో తెరపైకి రానుండడం విశేషం.

Advertisement
Advertisement