27న సెలవు | Sakshi
Sakshi News home page

27న సెలవు

Published Sun, May 26 2024 4:20 AM

27న స

భానుపురి (సూర్యాపేట): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోనఫైడ్‌ ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పోలింగ్‌ రోజున ఓటుహక్కు వినియోగానికి ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు మేరకు ప్రత్యేక సాధారణ (క్యాజువల్‌) సెలవు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.వెంకటరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక క్యాజువల్‌ సెలవు మంజూరు చేయాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. ప్రైవేట్‌ సంస్థలకు సెలవు ఇచ్చే అవకాశం లేకపోవడంతో డ్యూటీ షిఫ్టుల వారీగా మార్పులు చేయాలని సూచించారు.

విఽధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

మునగాల(కోదాడ): గ్రామాల అభివృద్ధితోపాటు విధుల నిర్వహణలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేయొద్దని డీపీఓ సురేష్‌కుమార్‌ అన్నారు. శనివారం ఆయన మునగాల మండలం గణపవరం గ్రామంలో పర్యటించారు. సెగ్రిగేషన్‌ షెడ్‌, పల్లె ప్రకృతి వనం, వైకుంఠథామాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి భూపాల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి దేవిరెడ్డి వీరారెడ్డి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ విజయలక్ష్మి, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి

చిలుకూరు: ఉపాధ్యాయులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ (ఎస్‌టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి కోరారు. శనివారం చిలుకూరులో నిర్వహించిన ఎస్‌టీయూ జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు వారు హాజరై మాట్లాడారు. ఉపాద్యాయులు నిత్య విద్యార్థుల్లాగా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, పున్న గణేష్‌, శ్రీనివాస్‌, నాయకులు బందం వెంకటేశ్వర్లు, ఎలగొండ శ్రీనివాస్‌, సురగాని లింగయ్య, కొండా రామాంజనేయులు, బీఆర్‌సీ.రెడ్డి, వీరేంద్రవర్మ, భిక్షం, చంద్రశేఖర్‌, అంజయ్య, నాగరాజు, శివయ్య, గోవిందునాయక్‌, రామిరెడ్డి, రాజేష్‌, నర్సింహారావు, బూర వెంకటేశ్వర్లు, కస్తూరి అప్పారావు, గోపి, సురేష్‌, సాదె వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

గొల్లకుర్మలకు నగదు బదిలీ చేయాలి

అర్వపల్లి: గొల్ల కుర్మలకు నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్‌) జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వజ్జె వినయ్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జీఎంపీఎస్‌ ఆధ్వర్యంలో శనివారం అర్వపల్లిలోని పశువైద్యశాల ఎదుట ధర్నా నిర్వహించారు. రెండో విడత గొర్రెల యూనిట్ల కోసం డీడీలు తీసి ఏడాది దాటినా ఇంతవరకు నగదు బదిలీ చేయలేదని చెప్పారు. గొల్లకుర్మలు అప్పులు తెచ్చి డీడీలు తీసి ప్రభుత్వానికి చెల్లించారని, వారి సమస్యలను అర్థం చేసుకోవాలని కోరారు. ఈ ధర్నాలో ఆ సంఘం నాయకులు గుడిపాటి సత్తయ్య, వజ్జె జయమ్మ, భయ్య భద్రమ్మ, వజ్జె మల్లమ్మ, వజ్జె వెంకన్న, వినోద్‌, అవిలమ్మ పాల్గొన్నారు.

27న సెలవు
1/2

27న సెలవు

27న సెలవు
2/2

27న సెలవు

Advertisement
 
Advertisement
 
Advertisement