పీఓలు, ఏపీఓల బాధ్యతలు కీలకం | Sakshi
Sakshi News home page

పీఓలు, ఏపీఓల బాధ్యతలు కీలకం

Published Thu, May 23 2024 6:05 AM

పీఓలు, ఏపీఓల బాధ్యతలు కీలకం

భానుపురి (సూర్యాపేట): జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఓ, ఏపీఓల బాధ్యతలు కీలకమని కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఎస్‌. వెంకటరావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం పీఓలు, ఏపీఓలకు మాస్టర్‌ ట్రైనర్‌ రమేష్‌తో నిర్వహించిన శిక్షణ తరగతులకు అదనపు కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంకతో కలిసి హాజరై మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27వ తేదీ ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో 51,497 మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఉన్నారని, వీరికోసం 71 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ నిర్వహణకు రిజర్వ్‌తో కలిపి 85 మంది పీఓలు, 85మంది ఏపీఓలు, 170 మంది ఓపీఓలను నియమించినట్లు వివరించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ చేస్తామని తెలిపారు. 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున జంబో బ్యాలెట్‌ బాక్స్‌ ఏర్పాటు చేశామన్నారు.

గుర్తింపు కార్డు చూపించి..

గ్రాడ్యుయేట్‌ ఓటర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయవచ్చన్నారు. పోలింగ్‌ అధికారులు ఇచ్చిన పెన్నుతోనే బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థి పేరుకు ఎదురుగా ఏర్పాటు చేసిన జోన్‌లో ప్రిఫరెన్స్‌ ప్రకారం సీరియల్‌గా నంబర్లు, లేదంటే రోమన్‌ అంకెలు వేయాలన్నారు. కార్యక్రమంలో నోడల్‌ అధికారులు సతీష్‌ కుమార్‌, అప్పారావు, మధుసూదనరాజు, సురేష్‌, లక్ష్మానాయక్‌, ఆర్డీఓ వేణుమాధవ్‌, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస రాజు పాల్గొన్నారు.

ఫ జిల్లా ఎన్నికల అధికారి వెంకటరావు

Advertisement
 
Advertisement
 
Advertisement