ఆదరించేదెవరినో.. | Sakshi
Sakshi News home page

ఆదరించేదెవరినో..

Published Wed, May 15 2024 5:35 AM

ఆదరిం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్‌ ప్రక్రియ సోమవారం పూర్తయింది. పోలింగ్‌ బూత్‌లలో వేసిన ఓట్లు 74.02 శాతం, పోస్టల్‌ ఓట్లు 1.02 శాతం కలుపుకొని మొత్తంగా 75.04 శాతం పోలింగ్‌ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొని ఓటు వేశారు. పట్టణ ప్రాంతాల్లో కాస్త తగ్గినప్పటికీ సాయంత్రం వేళ ఓటింగ్‌ పెరిగింది. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు మొత్తంగా 22 మంది బరిలో ఉన్నారు. ఇందులో మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ నెలకొంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను నల్లగొండ సమీపంలో అనిశెటి్‌ుట్దప్పలపల్లి పరిధిలోని వేర్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపరిచారు. జూన్‌ 4న కౌంటింగ్‌ జరగనుంది. ఆ రోజునే వారి భవితవ్యం తేలనుంది.

దేవరకొండలో తక్కువ.. హుజూర్‌నగర్‌లో ఎక్కువ

నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. ఈ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ శాతం పోలింగ్‌ నమోదు కాగా, దేవరకొండలో తక్కువగా నమోదైంది. హుజూర్‌నగర్‌లో అత్యధికంగా 76.34 శాతం మంది ఓట్లు వేయగా, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 70.60 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎవరి అంచనాలు వారివే..

నల్లగొండ లోక్‌సభ స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్‌ బూత్‌లలో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. తమకు అనుకూలమైన ఓటు పడిందని, తమ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, దేశంలోనే అధిక మెజార్టీ వస్తుందంటూ కాంగ్రెస్‌ నాయకులు చెప్పుకుంటున్నారు. బీజేపీ మాత్రం మోదీ చరిష్మాపైనే నమ్మకంతో ఉంది. బీఆర్‌ఎస్‌ మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామలను అమలు చేయకపోవడంతో ఆ పార్టీపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ బీఆర్‌ఎస్‌ పార్టీకే పడ్డాయని చెప్పుకుంటోంది.

మూడంచెల భద్రత

నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను అనిశెట్టిదుప్పలపల్లి వద్ద స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచారు. అక్కడ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ విధించడంతో పాటు స్థానిక పోలీసులతోపాటు ఆర్మ్‌డ్‌ రిజర్వుడ్‌, కేంద్ర బలగాలు, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పహారా కాస్తున్నాయి. 24 గంటలు సాయుధ బలగాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్ల వివరాలు..

నియోజకవర్గం పురుషులు సీ్త్రలు ట్రాన్స్‌జెండర్‌ మొత్తం

దేవరకొండ 94,896 90,405 9 1,85,310

నాగార్జునసాగర్‌ 87,949 88,231 10 1,76,190

మిర్యాలగూడ 85,811 87,513 10 1,73,334

హుజూర్‌నగర్‌ 94,065 97,871 9 1,91,945

కోదాడ 90,604 93,801 10 1,84,415

సూర్యాపేట 88,069 90,301 8 1,78,378

నల్లగొండ 92,203 95,328 34 1,87,565

మొత్తం 6,33,597 6,43,450 90 12,77,137

పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది

ఫ రిటర్నింగ్‌ అధికారి హరిచందన

నల్లగొండ : నల్లగొండ లోక్‌సభ స్థానానికి నిర్వహించిన పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఇందుకు సహకరించిన రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రజలు, ఓటర్లు, అధికారులు, మీడియా ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరిని కలెక్టర్‌ అభినందించారు.

ఫ ముగిసిన పార్లమెంట్‌ ఎన్నికల

పోలింగ్‌ ప్రక్రియ

ఫ పోస్టల్‌ ఓట్లు కలుపుకొని 75.04 శాతం ఓటింగ్‌ నమోదు

ఫ ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం

ఫ అంచనాల్లో అభ్యర్థులు, పార్టీలు

ఫ జూన్‌ 4న తేలనున్న ఫలితం

2019 కంటే స్పల్పంగా పెరుగుదల

నల్లగొండ పార్లమెంట్‌ నియోజకర్గం పరిధిలో 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్‌ శాతం స్వల్పంగా పెరిగింది. 2019 ఎన్నికల్లో పోస్టల్‌, ఎన్‌ఆర్‌ఐ ఓట్లు కలుపుకొని మొత్తంగా 74.13 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈ సారి 75.04 శాతానికి పెరిగింది. ఇక 2014 ఎన్నికలో 79.75 శాతం పోలింగ్‌ నమోదైంది. దాంతో పోల్చితే మాత్రం ఈ ఎన్నికల్లో తక్కువ పోలింగ్‌ శాతం నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

2023 అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 84.51 శాతం ఓట్లు నమోదు కాగా.. లోక్‌సభ ఎన్నికల్లో 74.13 శాతం ఓట్లు నమోదయ్యాయి. అప్పటి కంటే 10.38 శాతం ఓటింగ్‌ తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోనే అధికంగా పోలింగ్‌ శాతం నమోదైంది. నల్లగొండలో అతి తక్కువ పోలింగ్‌ నమోదైంది.

నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 2023 అసెంబ్లీ,

2024 లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ శాతం ఇలా..

అసెంబ్లీ సెగ్మెంట్‌ అసెంబ్లీ లోక్‌సభ

దేవరకొండ 84.49 70.60 నాగార్జునసాగర్‌ 85.79 74.50 మిర్యాలగూడ 83.49 73.34 హుజూర్‌నగర్‌ 86.44 76.34 కోదాడ 85.56 75.21 సూర్యాపేట 84.21 73.07 నల్లగొండ 81.60 75.20

(2024)

(2023)

పోలైన పోస్టల్‌ ఓట్ల వివరాలు

నియోజకవర్గం పోలైన ఓట్లు శాతం

దేవరకొండ 1137 0.43

నాగార్జునసాగర్‌ 1349 0.58

మిర్యాలగూడ 2410 1.02

హుజూర్‌నగర్‌ 1696 0.67

కోదాడ 2269 0.93

సూర్యాపేట 2979 1.22

నల్లగొండ 4135 1.66

ఇతర ప్రాంతాలనుంచి 1676 0.09

మొత్తం 17651 1.02

ఆదరించేదెవరినో..
1/1

ఆదరించేదెవరినో..

Advertisement
 
Advertisement
 
Advertisement