పోస్టల్‌ బ్యాలెట్‌కు 1,058 దరఖాస్తులు | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌కు 1,058 దరఖాస్తులు

Published Thu, Nov 9 2023 1:40 AM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌  - Sakshi

దురాజ్‌పల్లి (సూర్యాపేట) : వికలాంగులు, 80 ఏళ్ల వృద్ధులకు ఫాం– 12డీ ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌కు అవకాశం కల్పించగా జిల్లాలో 1,058 మంది మంది దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో సుమారుగా 32 వేల మంది వికలాంగులు, వృద్ధులకు పోస్టల్‌ ఓటుకు దరఖాస్తులు అందజేశామని, హుజూర్‌గర్‌ నియోజకవర్గం నుంచి 274, కోదాడ 174, సూర్యాపేట 278, తుంగతుర్తి 332 మొత్తం 1,058 మంది ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. కొత్త ఓటరు నమోదు, మార్పులు చేర్పులులకు అందిన దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 10న మొదటి సవరణ సప్లిమెంటరీ జాబితా విడుదల చేస్తామని తెలిపారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ నాగేశ్వరరావు, యంసీసీ నోడల్‌ అధికారి సతీష్‌ కుమార్‌, ఎకై ్సజ్‌ అధికారిణి అనిత పాల్గొన్నారు.

చెక్‌ పోస్టుల వద్ద నిఘా పెంచాం

జిల్లాలో అన్ని చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా ఇంటెలిజెన్స్‌ కమిటీ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావుతో కలసి కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో బ్యాంక్‌, డిజిటల్‌ లావాదేవీలపై నిఘా పెంచి వాటి రోజువారీ వివరాలు అందించాలన్నారు. గృహోపకరణలు, వస్త్ర దుకాణాల గోదాముల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 148 కేసులు నమోదు కాగా ఇందులో 134 కేసులకు సంబంధించి రూ. 2,98,21,038 విలువ గల నగదు, బంగారం, వెండి విడుదల చేసినట్లు వివరించారు. ఎకై ్సజ్‌ శాఖ ద్వారా ఇప్పటివరకు 426 కేసులు నమోదు చేసి 215 మందిని అరెస్ట్‌ చేశామని, 45,970 లీటర్ల మద్యం పట్టుకున్నామని దాని విలువ రూ. 3,14, 29, 448 ఉంటుందని తెలిపారు. కోడ్‌ ఉల్లంఘనలపై నాలుగు కేసులు నమోదైనట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ అనిత, డీఎఫ్‌ఓ సతీష్‌ కుమార్‌, సీటీఓ యాదగిరి, డీసీఓ శ్రీధర్‌, ఏఓ సుదర్శన్‌ రెడ్డి, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement