బాలల సంరక్షణకు ప్రత్యేక నిఘా | Sakshi
Sakshi News home page

బాలల సంరక్షణకు ప్రత్యేక నిఘా

Published Sun, May 26 2024 5:05 AM

-

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: బాలబాలికల సంరక్షణకు ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి పి.భాస్కరరావు అన్నారు. శనివారం ఇంటర్నేషనల్‌ మిస్సింగ్‌ చిల్డ్రన్స్‌ డే సందర్భంగా జిల్లా న్యాయ సదన్‌లో ప్రత్యేక కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పిపోతున్న బాలబాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి పిల్లల కదలికలపై ఆరా తీసి తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో తేడా గుర్తిస్తే వెంటనే వారిని సన్మార్గంలో పెట్టాలన్నారు. అపరిచిత వ్యక్తులతో పరిచయాల వల్ల కలిగే అనర్థాలను పిల్లలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యద ర్శి, సివిల్‌ జడ్జి(సీనియర్‌ డివిజన్‌) ఆర్‌.సన్యాసినా యుడు, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ బగాది శాంతిశ్రీ, బాలల సంరక్షణాధికారి కె.వి.రమణ, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ లక్ష్మీవిద్య, ఎన్జీవో ప్రతినిధి ప్రసాద్‌, పోలీసులు, సచివాలయ మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement