మాక్‌ థ్రిల్‌ | Sakshi
Sakshi News home page

మాక్‌ థ్రిల్‌

Published Sun, May 26 2024 5:05 AM

మాక్‌

శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2024

దోపిడీ కేసులో ఆరుగురు అరెస్టు

ధర్మలక్ష్మీపురంలో ఇటీవల జరిగిన దోపిడీ కేసు ను పోలీసులు ఛేదించారు. ఆరుగురిని అరెస్టు చేసి రూ.4.80 లక్షలు రికవరీ చేశారు.

8లో

నిరసనకారుల దాడులు.. నిలువరించిన పోలీసులు

శ్రీకాకుళం క్రైమ్‌:

స్థలం: జిల్లా కేంద్రంలోని డేఅండ్‌ నైట్‌ కూడలి..

సమయం: శనివారం ఉదయం 11:14 గంటలు..

వంద మంది ఆందోళనకారుల గుంపు ఒక్కసారిగా దూసుకొచ్చింది..

ఓ చేతిలో ప్లకార్డులు.. మరో చేతిలో రాళ్లు.. పోలీసులు డౌన్‌ డౌన్‌.. అంటూ నినాదాలు..

కూడలి మధ్య మంట పెట్టిన టైర్లు..

ఎటు చూసినా భయానక వాతావరణం..

ఒక్కసారిగా జరిగిన ఈ అలజడికి నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే రెండో పట్టణ సీఐ ఉమామహేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు సరికదా.. ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. చేతికందినవన్నీ పోలీసులపై విసరడం మొదలుపెట్టారు. అంతే ఉన్నతాధికారులకు సీఐ సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఎస్పీ రాధిక ఆదేశాలతో డీఎస్పీ శేషాద్రినాయుడు ఆధ్వర్యంలోని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ దళాలు రెండు వ్యాన్లతో అక్కడికి చేరాయి. మరో వైపు అగ్నిమాపక శకటం వెంటబెట్టుకుని జిల్లా అగ్నిమాపక సహాయాధికారి వరప్రసాదరావు సిబ్బందితో పాటు చేరుకున్నారు. ఎస్పీ రాధిక ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం ఆందోళనల్ని ఎలా అదుపు చేయాలో ప్రణాళిక సిద్ధం చేశారు. పోలీస్‌ బృందాలు ‘యాక్షన్‌’ మొదలుపెట్టాయి. ఫైర్‌ ఇంజన్‌తో ఒక్కసారిగా నీటితో పాటు ఫోమ్‌ను ప్రయోగించారు. ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి లాఠీచార్జీ చేశా యి. పరిస్థితులు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. మరోవైపు ప్లాస్టిక్‌ పెల్లెట్స్‌ ఫైర్‌ చేసి హెచ్చరించారు. ఆందోళనకారుల్ని చెదరగొడుతూ గాల్లోకి ‘కాల్పులు’ జరిపారు. ఈ నేపథ్యంలో ముగ్గురు నిరసన కారులు కుప్పకూలారు. అంబులెన్స్‌లు హడావిడి.. పోలీస్‌ సైరన్‌ల శబ్దాలతో ఆ ప్రాంతమంతా తీవ్ర గందరగోళం నెలకొంది. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు వారిని వాహనాల్లో తరలించారు.

ఈ దృశ్యాల్ని చూస్తూ భీతావహులైన ప్రజలకు మైక్‌లో ఒక ఎనౌన్స్‌మెంట్‌ వినిపించింది.

‘ఇది మాక్‌ డ్రిల్‌.. కౌంటింగ్‌ నేపథ్యంలో ఏమైనా హింసాత్మక ఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో వివరించడంలో భాగంగా పోలీసులు చేసిన సన్నాహక కార్యక్రమం’ అని పోలీసులు ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంత వరకు ‘నటించిన’ పోలీసులు అక్కడ్నుంచి నిష్క్రమించారు.

న్యూస్‌రీల్‌

మాక్‌ థ్రిల్‌
1/2

మాక్‌ థ్రిల్‌

మాక్‌ థ్రిల్‌
2/2

మాక్‌ థ్రిల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement