కాశీబుగ్గలో భారీ చోరీ | Sakshi
Sakshi News home page

కాశీబుగ్గలో భారీ చోరీ

Published Sat, May 25 2024 2:55 PM

కాశీబుగ్గలో భారీ చోరీ

కాశీబుగ్గ : కాశీబుగ్గ రోటరీనగర్‌లో గురువారం అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లో చొరబడి డైమండ్స్‌తో కూడిన 40 తులాల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 17వ వార్డు రోటరీనగర్‌లో నివాసముంటున్న చాప అలివేలు వజ్రపుకొత్తూరు మండలం ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కార్యాలయంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ గా పనిచేస్తోంది. గురువారం విధులు ముగించుకు ని తన స్వగ్రామమైన నందిగాం మండలం హరిదాసుపురం చేరుకుని అక్కడే రాత్రి బస వేసింది. ఇదే అదునుగా గుర్తు తెలియని వ్యక్తులు రోటరీగనర్‌లో ని ఆమె ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. రెండు అలమరాలతో పాటు, బీరువాను పగలు కొట్టి అందులో ఉన్న ఆభరణాలు, నగదు దోచుకుపోయారు. అందులో రూ.17లక్షల విలువైన డైమండ్‌తో కూడిన 40 తులాల బంగారం, 10 తులాల వెండి వస్తువులు, రూ.18వేల నగదు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చోరీ జరిగిన సొత్తు విలువ రూ.45 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. కుమార్తె పెళ్లి కోసం కష్టపడి దాచుకున్న సొత్తు దొంగల పాలైందంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈమె భర్త సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా ప్రస్తుతం ఎన్నికల విధులలో ఉన్నారు. కుమార్తె బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గా పని చేస్తోంది. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ ఎస్‌ఐ పారినాయుడు, క్రైం హెచ్‌సీ శ్రీనివాసరావు, క్లూస్‌టీం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

రూ.45 లక్షల విలువైన సొత్తుతో

దొంగలు పరార్‌

రంగంలోకి దిగిన క్లూస్‌టీం

Advertisement
 
Advertisement
 
Advertisement