18 నుంచి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
నరసన్నపేట: స్థానిక వేంకటేశ్వరస్వామి ఆల యాన్ని ప్రతిష్టించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 18 నుంచి 27 వరకూ బ్రహ్మోత్సవాలు ఆలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుండగా మరో వైపు ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వాన పత్రికలు చురుగ్గా పంపిణీ చేస్తున్నారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 18 నుంచి 27 వరకూ రోజూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చామర్తి శ్రీనివాసాచార్యులు కృష్ణమాచార్యులు, ఆలయ ట్రస్టు కమిటీ చైర్మన్ పి.వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఓటెత్తిన గిరిజన గ్రామం
హిరమండలం: మండలంలోని గొడియపాడు గిరిజన గ్రామంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 316 పోలింగ్ బూత్ పరిధిలో అక్కడి ఓటర్లు 91.07శాతం ఓట్లేశారు. ఈ గ్రామంలో మొత్తం 224 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 91మంది ఓటు వేయ గా సీ్త్రలు 113 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే లొకొండ గిరిజన గ్రామం 315 పోలింగ్ బూత్‌లో 90.67శాతం పోలింగ్ నమోదు జరిగింది. గ్రామంలో మొత్తం 193 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 80మంది, సీ్త్రలు 95మంది ఓటుహక్కు వినియోగించుకుని మండలంలో ద్వితీయ స్థానంలో నిలిచారు. అత్యల్పంగా మేజర్ పంచాయతీ హిరమండలం 298బూత్‌లో 56.47 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 870మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 244మంది, సీ్త్రలు 236 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మార్కెట్‌లోకి ఉద్దానం మునగ
కాశీబుగ్గ: ఉద్దానంలో పండుతున్న దేశీ మునగ మార్కెట్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం హైబ్రీడ్ మునగకాయులు విరివిగా దొరుకుతున్నప్పటికీ దేశీ మునగకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఉద్దానం దేశీ మునగను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పలాస, మందస మండలం సముద్ర తీరంలో వ్యాపించి ఉన్న ఉద్దాన దేశీ పంట మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. పలాస, కాశీబుగ్గ,పూండి, మందస,హరిపురం, బ్రాహ్మ ణతర్లా మార్కెట్‌లో అమ్మకాలు సాగుతున్నాయి. కట్ట రూ.30 మొదలుకొని లభించడంతో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
నరసన్నపేట: వైశాఖ మాసం మొదటి మంగళవారం సందర్భంగా మండల కేంద్రం నరసన్నపేటలో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక పైడితల్లి, శాంతామణి, నూకాలమ్మ తల్లి అసిరమ్మతల్లి ఆలయాల్లో అమ్మవారికి మహిళలు ముర్రాటు సమర్పించి మామిడి పండ్లతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాల వద్ద రద్దీ నెలకొంది. ఉదయం నుంచి 10 గంటల వరకు ఈ రద్దీ కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment