మహిళపై టీడీపీ ఏజెంట్ల దౌర్జన్యం | Sakshi
Sakshi News home page

మహిళపై టీడీపీ ఏజెంట్ల దౌర్జన్యం

Published Tue, May 14 2024 11:10 AM

మహిళప

టెక్కలి: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో 113,114 పోలింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజంట్‌ రెయ్యి భువనేశ్వరిపై టీడీపీ ఏజంట్‌ రెయ్యి ప్రీతీష్‌తో పాటు మరికొంత మంది దౌర్జన్యానికి దిగారు. టీడీపీ ఏజెంట్‌ తో పాటు వారి మద్దతుదారులు పోలింగ్‌ కేంద్రం వద్ద మహిళా ఓటర్లను బెదిరిస్తున్న నేపథ్యంలో దానికి అడ్డుపడిన వైఎస్సార్‌సీపీ ఏజంట్‌ భువనేశ్వరిని అసభ్య పదజాలతో దూషించారు. దీంతో ఆమె స్థానిక మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ గొండేల సుజాత, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు సాయంతో టెక్కలి డీఎస్పీ బాలచంద్రారెడ్డి, పోలింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. సుంకు డిల్లేశ్వరరావు, సుంకు గోపి, సుంకు శ్యామ్‌, కొమ్ము హేమంత్‌, కొమ్ము తరుణ్‌, కొమ్ము నాయుడు, కొమ్ము నవీన్‌కుమార్‌, రెయ్యి ప్రీతీష్‌, పేర మురళీ తదితరులు తనపై దాడి చేసి అసభ్యకరంగా మాట్లాడినట్లు ఫిర్యాదు చేశారు.

మహిళపై  టీడీపీ ఏజెంట్ల దౌర్జన్యం
1/1

మహిళపై టీడీపీ ఏజెంట్ల దౌర్జన్యం

Advertisement
 
Advertisement
 
Advertisement