పలాసలో వైఎస్సార్‌సీపీ నేతల నిరసన.. | Sakshi
Sakshi News home page

పలాసలో వైఎస్సార్‌సీపీ నేతల నిరసన..

Published Tue, May 14 2024 11:10 AM

పలాసల

కాశీబుగ్గ : పలాస పురుషోత్తపురం హైస్కూల్‌ వద్ద పోలింగ్‌ బూత్‌ వద్దకు టీడీపీ నాయకులను ఇష్టారాజ్యంగా విడిచిపెడుతున్నారని వైఎస్సార్‌ సీపీ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. ఏజెంట్ల పేరుతో గది నిండా టీడీపీ నాయకులు చేరడంతో పోలీసులను నిలదీశారు. అప్పటికీ తీరుమారకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నాయకుడు సప్ప నవీన్‌ను బయటకు పంపాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ నాయకులు బడగల బల్లయ్యనాయుడు, జోగి సతీష్‌ తదితరులు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీకి కొమ్ము కాయడం తగదని చెప్పారు. దీంతో పోలీసులు నాయకులను చెదరగొట్టారు.

పలాసలో వైఎస్సార్‌సీపీ నేతల నిరసన..
1/2

పలాసలో వైఎస్సార్‌సీపీ నేతల నిరసన..

పలాసలో వైఎస్సార్‌సీపీ నేతల నిరసన..
2/2

పలాసలో వైఎస్సార్‌సీపీ నేతల నిరసన..

Advertisement
 
Advertisement
 
Advertisement