ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశాం: కలెక్టర్‌ | Sakshi
Sakshi News home page

ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశాం: కలెక్టర్‌

Published Fri, May 10 2024 8:05 PM

-

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: సాధారణ ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. ఈ నెల 13 న రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ ప్రణాళిక అమలు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌ హాల్‌ నుంచి హాజరైన జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌, జిల్లా ఎస్పీ జీఆర్‌ రాధికతో కలసి మాట్లాడారు. శాంతి భద్రతల నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్‌ కేంద్రాల్లో కనీస మౌలిక వసతి సదుపాయాలు, పోలింగ్‌ సిబ్బంది వివరాలు, వెబ్‌ కాస్టింగ్‌, ఎలక్ట్రోల్‌ రోల్‌, పోలింగ్‌ సిబ్బందికి వాహనాల ఏర్పాటు తదితర అంశాలపై తీసుకున్న చర్యలను కలెక్టర్‌ ఈ సందర్భంగా వివరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement