‘ఎన్నికల భారతం’ కవితా సంకలనం ఆవిష్కరణ | Sakshi
Sakshi News home page

‘ఎన్నికల భారతం’ కవితా సంకలనం ఆవిష్కరణ

Published Fri, May 10 2024 8:05 PM

‘ఎన్నికల భారతం’ కవితా సంకలనం ఆవిష్కరణ

శ్రీకాకుళం కల్చరల్‌: అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర శాఖ ప్రచురించిన ‘ఎన్నికల భారతం’ కవితా సంకలనం పుస్తకాన్ని గురువారం శ్రీకాకుళం నగరంలోని గరిమెళ్ల ప్రెస్‌ క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ జీవితం, రాజకీ యం వేర్వేరు కాదన్నారు. ఎన్నికల పట్ల సమాజ స్పందనలను తెలియచేయడం కవులు, రచయితల బాధ్యతని పేర్కొన్నారు. అరసం రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యుడు నల్లి ధర్మారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా న్యాయవాది, సీనియర్‌ ఉద్యమ నాయకులు బొడ్డేపల్లి మోహనరావు, తెరవే జిల్లా అధ్యక్షుడు ఉత్తరావిల్లి నాగేశ్వరరావు, హిందీ ప్రచార పరిషత్‌ ఉత్తరాంధ్ర నాయకులు కోనే శ్రీధర్‌, యువ కవులు కంచరాన భుజంగరావు, కలమట దాసుబాబు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు చింతాడ అప్పలనాయుడు, సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.వి.మల్లేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు ఎస్‌.నవచైతన్య, ఇస్కఫ్‌ జిల్లా అధ్యక్షుడు జి.వి.నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement