19న జిల్లా సీనియర్స్‌ ఖోఖో జట్ల ఎంపిక | Sakshi
Sakshi News home page

19న జిల్లా సీనియర్స్‌ ఖోఖో జట్ల ఎంపిక

Published Fri, Nov 17 2023 12:54 AM

-

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా సీనియర్స్‌ పురుషులు, మహిళల ఖోఖో జట్ల ఎంపికలు ఈ నెల 19న నిర్వహించనున్నట్లు ఖోఖో అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు చిట్టి నాగభూషణం, సీహెచ్‌ ఫల్గుణరావు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఆదివారం ఉదయం 9 నుంచి ఎంపికలు మొదలవుతాయని చెప్పారు. ఎంపికై న జిల్లా జట్లను డిసెంబర్‌ 8 నుంచి 10 వరకు ప్రకాశం జిల్లా మార్కాపురం వేదికగా జరిగే రాష్ట్రస్థాయి సీనియర్స్‌ ఖోఖో చాంపియన్‌షిప్‌ పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో హాజరై జిల్లా సహాయ కార్యదర్శి ఎం.నీలాద్రిరావు వద్ద రిపోర్ట్‌ చేయాలని కోరారు.

Advertisement
Advertisement