మడకశిరలో భారీ వర్షం | Sakshi
Sakshi News home page

మడకశిరలో భారీ వర్షం

Published Sun, May 26 2024 7:40 AM

మడకశి

పుట్టపర్తి అర్బన్‌: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి మడకశిరలో భారీ వర్షం కురిసింది. ఇక్కడ 72 మి.మీ. వర్షం కురవడంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యాములకు నీరు చేరింది. పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలవాలాయి. రాత్రి 9 నుంచి శనివారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లేడుగుంటలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడటంతో మంటలు ఎగిసిపడ్డాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులకు షెడ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మడకశిర మండలం 72.2 మి.మీ, కనగానపల్లి 63.4, అమరాపురం 42.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక గుడిబండలో 37.8, ఓడీ చెరువు 26.2, అమడగూరు 25.4, రామగిరి 15.4, హిందూపురం 9.8, లేపాక్షి 9.6, చిలమత్తూరు 8.6, రొద్దం 8.2, గోరంట్లలో 7.2, తలుపుల, రొళ్లలో 5.4, పెనుకొండ 5, సీకే పల్లి 4.4, అగళి 4, ముదిగుబ్బ 1.8 మి.మీ వర్షం కురిసింది. ఈ వర్షాలకు జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.

జిల్లాలోని 18 మండలాల్లో వానలు

పొంగిన వాగులు, వంకలు

మడకశిరలో భారీ వర్షం
1/2

మడకశిరలో భారీ వర్షం

మడకశిరలో భారీ వర్షం
2/2

మడకశిరలో భారీ వర్షం

Advertisement
 
Advertisement
 
Advertisement