Sakshi News home page

No Headline

Published Mon, Nov 20 2023 12:26 AM

- - Sakshi

నెల్లూరులోని పొగతోటలో ఓ ప్రముఖ వైద్యుడి ఇంట్లో చోరీ జరిగింది. నిందితులు పెద్ద ఎత్తున బంగారు, నగదు అపహరించుకుని వెళ్లారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్థానికంగా ఉండే సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ ఫుటేజ్‌లో నిందితులు పరారవుతున్న దృశ్యాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా కేసును ఛేదించి నిందితులను అరెస్ట్‌ చేశారు.

తాము చేసే నేరాలు ఎవరూ చూడడం లేదని నేరస్తులు భావిస్తారు. కానీ నేరాల కట్టడిలో భాగంగా పోలీసుశాఖ జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలే నేరస్తులను పట్టిస్తున్నాయి. నిఘా నేత్రం అడుగడుగునా వెంటాడుతూ నేరాల కట్టడిలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి.

Advertisement
Advertisement