కృనాల్ ఆల్‌రౌండ్ షో.. ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ | Royal Challengers Bengaluru beat Delhi Capitals by 6 wickets | Sakshi
Sakshi News home page

IPL 2025: కృనాల్ ఆల్‌రౌండ్ షో.. ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ

Apr 27 2025 11:25 PM | Updated on Apr 27 2025 11:28 PM

Royal Challengers Bengaluru beat Delhi Capitals by 6 wickets

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌రో అద్బుత విజ‌యాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో బాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 163 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.3 ఓవ‌ర్ల‌లో చేధించింది.

26 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని కృనాల్ పాండ్యా, విరాట్ కోహ్లి తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో విజయతీరాలకు చేర్చారు. కృనాల్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 పరుగులు చేయగా.. విరాట్ 46 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు.

ఆఖ‌రిలో టిమ్ డేవిడ్(5 బంతుల్లో 19) మెరుపులు మెరిపించాడు. ఈ విజ‌యంతో చిన్న‌స్వామి స్టేడియంలో ఢిల్లీ చేతిలో ఎదురైన ప‌రాభావానికి ఆర్సీబీ బ‌దులు తీర్చుకుంది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. చ‌మీరా ఓ వికెట్ సాధించాడు. మ‌రో వికెట్ ర‌నౌట్ రూపంలో ల‌భించింది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 8 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్‌(41) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. స్ట‌బ్స్(34),ఫాఫ్ డుప్లెసిస్‌(22), అభిషేక్ పోరెల్‌(28) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. హాజిల్‌వుడ్ రెండు, ద‌యాల్‌, పాండ్యా తలా వికెట్ సాధించారు. ఈ విజ‌యంతో ఆర్సీబీ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్దానికి చేరుకుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement