T20 World Cup 2022: న్యూజిలాండ్‌ కొత్త జర్సీ చూశారా..?

New Zealand unveil their jersey for T20 World Cup 2022 - Sakshi

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు తమ కొత్త జెర్సీలను విడుదల చేస్తున్నాయి. తాజాగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కూడా తమ కొత్త జెర్సీని లాంచ్‌ చేసింది.  డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్ తమ కొత్త జెర్సీలను ధరించి ఉన్న ఫోటోను న్యూజిలాండ్‌ క్రికెట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కివీస్‌ న్యూ జెర్సీ బూడిద, నలుపు రంగు కలయికతో ఉంది.

                               

కాగా యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌-2021లో న్యూజిలాండ్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కివీస్‌ పరాజాయం పాలైంది. ఇక ఈ ఏడాది జరగనున్న పొట్టి ప్రపంచకప్‌లో టైటిల్‌ సాధించాలని న్యూజిలాండ్‌ జట్టు భావిస్తోంది. ఔ

ఇక టీ20 ప్రపంచకప్‌లో కివీస్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 22న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్‌ సన్నహాకాల్లో భాగంగా స్వదేశంలో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌తో ట్రై సిరీస్‌లో న్యూజిలాండ్‌ తలపడనుంది. 

టీ20 ప్రపంచ కప్‌కు న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), టిమ్ సౌతీ, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, మార్టిన్ గప్టిల్, లాకీ ఫెర్గూసన్, డెవాన్ కాన్వే, మార్క్ చాప్‌మన్, మైఖేల్ బ్రేస్‌వెల్, ట్రెంట్ బౌల్ట్, ఫిన్‌ అలెన్
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. టీమిం‍డియా అత్యంత చెత్త రికార్డు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top