ఫోర్‌​ కొట్టిన గిల్‌.. సచిన్‌ అంటూ అరిచిన అభిమానులు.. ఎందుకంటే! | Mumbai crowd chants Sachin, Sachin after Shubman Gill smashes a four | Sakshi
Sakshi News home page

Ind Vs Nz 2nd Test: ఫోర్‌​ కొట్టిన గిల్‌.. సచిన్‌ అంటూ అరిచిన అభిమానులు.. ఎందుకంటే!

Dec 5 2021 1:35 PM | Updated on Dec 5 2021 7:22 PM

Mumbai crowd chants Sachin, Sachin after Shubman Gill smashes a four - Sakshi

Mumbai crowd chants Sachin, Sachin after Shubman Gill smashes a four:  ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో ఓ అసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.  భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా శుభ్‌మాన్‌ గిల్‌ ఓపెనింగ్‌కు రాలేదు. అతడి స్ధానంలో పుజారా ఓపెనర్‌గా వచ్చాడు. దీంతో మూడో రోజు గిల్‌ ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే మూడో రోజు ఆటలో భాగంగా కీవిస్‌ బౌలర్‌ సౌథీ వేసిన బంతిని మిడ్‌ వికెట్‌ దిశగా గిల్‌ బౌండరీకు తరలించాడు.

దీంతో ఒక్క సారిగా స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు సచిన్‌ సచిన్‌ అంటూ గట్టిగా అరిచారు. కాగా గిల్, టెండూల్కర్ కుమార్తె సారా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ  నేపథ్యంలో గిల్‌ను టార్గెట్‌ చేస్తూ..  అభిమానులు అలా అరిచినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. ఇక ముంబై వాంఖడే స్టేడియం సచిన్‌ హోం గ్రౌండ్‌ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చదవండిInd Vs Nz 2nd Test- Virat Kohli: 62 పరుగులకే ఆలౌట్‌.. అయినా అందుకే టీమిండియా ఫాలో ఆన్‌ ఆడించలేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement