Miami Opens 2023: మయామీ ఓపెన్‌ విజేత మెద్వెదెవ్‌ | Miami Opens 2023: Russian superstar Daniil Medvedev Wins Maiden Miami Opens Title | Sakshi
Sakshi News home page

Miami Opens 2023: మయామీ ఓపెన్‌ విజేత మెద్వెదెవ్‌

Apr 4 2023 3:33 AM | Updated on Apr 4 2023 3:33 AM

Miami Opens 2023: Russian superstar Daniil Medvedev Wins Maiden Miami Opens Title - Sakshi

మయామీ: రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ ఈ ఏడాది తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ నాలుగో ఏటీపీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక ఏటీపీ మాస్టర్స్‌ 1000 టోర్నీలో మెద్వెదెవ్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 7–5, 6–3 స్కోరుతో జనిక్‌ సిన్నర్‌ (ఇటలీ)ని ఓడించాడు.

1 గంటా 34 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో  మెద్వెదెవ్‌ 9 ఏస్‌లు కొట్టగా, సిన్నర్‌ 6 ఏస్‌లు బాదాడు. రష్యా ఆటగాడు 6 డబుల్‌ ఫాల్ట్‌లు చేసినా ఆ ప్రభావం ఫలితంపై పడకుండా సత్తా చాటడం విశేషం. 2023లో 24 మ్యాచ్‌లలో గెలిచి ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిన మెద్వెదెవ్‌ ఖాతాలో ఇది నాలుగో టైటిల్‌ కాగా ఓవరాల్‌గా ఐదో ఏటీపీ మాస్టర్స్‌ టైటిల్‌.

Advertisement
 
Advertisement
Advertisement