ముంబై ఇండియన్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా

Published Fri, Dec 15 2023 6:35 PM

IPL 2024: Hardik Pandya Appointed Mumbai Indians Captain - Sakshi

ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. 2024 ఐపీఎల్‌ సీజన్‌ నుంచి జట్టు కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా వ్యవహరిస్తాడని ప్రకటించింది. ఇటీవలే హార్దిక్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడింగ్‌ చేసుకున్న ఎంఐ టీమ్‌.. రోజుల వ్యవధిలోనే రోహిత్‌ను మార్చి హార్దిక్‌కు పగ్గాలు అప్పజెప్పడం చర్చనీయాంశంగా మారింది.

పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపడితే రోహిత్‌ శర్మ సాధారణ ఆటగాడిలా జట్టులో కొనసాగుతాడా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కొందరేమో రోహిత్‌ ఇష్టపూర్వకంగానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని, కొత్త కెప్టెన్‌ నిర్ణయాన్ని యాజమాన్యానికే వదిలేశాడని అంటున్నారు. ఏదిఏమైనా ఎంఐ యాజమాన్యం నిర్ణయంతో హిట్‌మ్యాన్‌ అభిమానులు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

2013 సీజన్‌ నుంచి కెప్టెన్‌గా వ్యవహరిస్తూ, జట్టును ఐదు సార్లు ఛాంపియన్‌గా (2013, 2015, 2017, 2019, 2020) నిలిపిన కెప్టెన్‌ పట్ల ఇలాగేనా ప్రవరించేదంటూ  ఎంఐ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. 

Advertisement
 
Advertisement