Ind vs Aus, 2nd Test: Indian women's hockey team loses 3-2 to Australia - Sakshi
Sakshi News home page

Ind Vs Aus: సిరీస్‌ కోల్పోయిన భారత మహిళలు

May 21 2023 8:35 AM | Updated on May 21 2023 11:29 AM

Ind Vs Aus 2023: India Women Hockey Team Lost Series To Australia - Sakshi

సిరీస్‌ కోల్పోయిన భారత మహిళలు (PC: Hockey India)

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల హాకీ సిరీస్‌ను భారత మహిళల జట్టు 0–2తో చేజార్చుకుంది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3–2 గోల్స్‌ తేడాతో భారత్‌ను ఓడించింది. ఆసీస్‌ తరఫున టాటమ్‌ స్టివార్ట్‌ (12వ, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా, పిపా మోర్గాన్‌ (38వ ని.) మరో గోల్‌ నమోదు చేసింది.

భారత మహిళల్లో సంగీత కుమారి (13వ ని.), గుర్జీత్‌ కౌర్‌ (17వ ని.) గోల్స్‌ సాధించారు. ఒక దశలో 2–1తో ముందంజలో ఉన్నా...ఆ తర్వాత మన జట్టు వెనుకబడింది. తాజా ఫలితంతో ఆసీస్‌ 2–0తో సిరీస్‌ గెల్చుకోగా, చివరి మ్యాచ్‌ నేడు జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement