విజయంతో ముగించిన హైదరాబాద్‌ ఎఫ్‌సీ  | Hyderabad FC finished with a win | Sakshi
Sakshi News home page

విజయంతో ముగించిన హైదరాబాద్‌ ఎఫ్‌సీ 

Feb 27 2023 2:58 AM | Updated on Feb 27 2023 3:06 AM

Hyderabad FC finished with a win - Sakshi

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) లీగ్‌ దశను హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (హెచ్‌ఎఫ్‌సీ) విజయంతో ముగించింది. ఆదివారం కొచ్ఛిలో జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 1–0 గోల్‌ తేడాతో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది. 29వ నిమిషంలో చేసిన ఏకైక గోల్‌తో బొర్జా హెరెరా  హైదరాబాద్‌ను గెలిపించాడు.

లీగ్‌ దశలో ఆడిన 20 మ్యాచ్‌లలో 13 గెలిచి 4 మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్‌ మరో 3 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. మొత్తం 42 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన టీమ్‌ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్‌’ దశకు అర్హత సాధించింది. లీగ్‌ దశలో 46 పాయింట్లతో ముంబై సిటీ ఎఫ్‌సీ అగ్రస్థానంలో నిలిచింది.  

మార్చి 4న కోల్‌కతాలో మోహన్‌బగాన్, ఒడిషా ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్‌ విజేతతో హైదరాబాద్‌ రెండో సెమీఫైనల్‌ (తొలి అంచె)లో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ మార్చి 9న హైదరాబాద్‌లోనే జరుగుతుంది. మార్చి 13న రెండో సెమీఫైనల్‌ (రెండో అంచె) మ్యాచ్‌ ప్రత్యర్థి వేదికపై జరుగుతుంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement