#Dipa Karmakar: ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో... | Dipa Karmakar set to play Senior Artistic Gymnastics National Championships | Sakshi
Sakshi News home page

#Dipa Karmakar: ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో...

Dec 28 2023 11:44 AM | Updated on Dec 28 2023 11:55 AM

Dipa Karmakar set to play Senior Artistic Gymnastics National Championships - Sakshi

భారత మహిళా స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో పోటీపడనుంది. జనవరి 2 నుంచి భువనేశ్వర్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. 30 ఏళ్ల దీపా 2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంతో సంచలనం సృష్టించింది.

ఆ తర్వాత మోకాలి గాయంతో ఆటకు దూరమైంది. పునరాగమనం తర్వాత డోపింగ్‌ పరీక్షలో పట్టుబడి 21 నెలలపాటు నిషేధానికి గురైంది. నిషేధం గడువు పూర్తి కావడంతో ఆమె మళ్లీ బరిలోకి దిగుతోంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement