కళ్లు చెదిరే విన్యాసం.. సచిన్‌ టెండూల్కర్‌ను సైతం ముగ్ధుడిని చేసింది | Belgaum Cricketer Taking Super Catch On The Boundary Line Goes Viral | Sakshi
Sakshi News home page

Viral Video: కళ్లు చెదిరే విన్యాసం.. సచిన్‌ టెండూల్కర్‌ను సైతం ముగ్ధుడిని చేసింది

Oct 31 2023 1:21 PM | Updated on Oct 31 2023 2:50 PM

Belgaum Cricketer Taking Super Catch On The Boundary Line Goes Viral - Sakshi

బెల్గామ్‌లో (కర్ణాటక) జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌కి సంబంధించిన వీడియో  నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోలో కిరణ్ తర్లేకర్ అనే స్థానిక క్రికెటర్‌ బౌండరీ లైన్‌ వద్ద అద్భుతమైన విన్యాసం చేసి, సహచరుడు క్యాచ్‌ పట్టేందుకు తోడ్పడతాడు. వివరాల్లోకి వెళితే.. బెల్గామ్‌లో స్థానికంగా ఓ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో బ్యాటర్‌ భారీ షాట్‌ కోసం​ ప్రత్నించి క్యాచ్‌ ఔట్‌ అవుతాడు. బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌ పట్టుకునే క్రమంలో తర్లేకర్ అనే ప్లేయర్‌ అద్భుతమైన విన్యాసాన్ని చేశాడు. 

సిక్సర్‌గా వెళ్లే బంతిని గాల్లోకి నెట్టి ఫుట్‌బాల్‌ తరహాలో షాట్‌ కొట్టి సహచరుడు క్యాచ్‌ పట్టుకునేలా చేశాడు. ఈ తంతుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. తర్లేకర్ విన్యాసాన్ని చూసి క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ సైతం ముగ్దుడయ్యాడు. ఈ క్యాచ్ పట్టిన ఆటగాడికి ఫుట్ బాల్ కచ్చితంగా తెలిసి ఉండాలని కామెంట్‌ చేశాడు. ఇదే వీడియోను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం రీట్వీట్ చేస్తూ..  గ్రేటెస్ట్ క్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్ అని క్యాప్షన్ ఇచ్చాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement