Thailand Open: మెయిన్‌ ‘డ్రా’కు అష్మిత అర్హత  | Ashmita Chaliha, Malvika Bansod Enters Main Draw In Thailand Open | Sakshi
Sakshi News home page

Thailand Open: మెయిన్‌ ‘డ్రా’కు అష్మిత అర్హత 

May 18 2022 7:57 AM | Updated on May 18 2022 7:57 AM

Ashmita Chaliha, Malvika Bansod Enters Main Draw In Thailand Open - Sakshi

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువతారలు అష్మిత చాలియా, మాళవిక బన్సోద్‌ మహిళల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించారు. బ్యాంకాక్‌లో మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో అష్మిత 21–16, 21–18తో జెనీ గాయ్‌ (అమెరికా)పై... మాళవిక 21–18, 21–8తో అనుపమ ఉపాధ్యాయ్‌ (భారత్‌)పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్లు ప్రియాన్షు రజావత్, శుభాంకర్, కిరణ్‌ జార్జి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. 

Advertisement
 
Advertisement
Advertisement