భూంపల్లి ఎస్‌ఐ సస్పెన్షన్‌ | Sakshi
Sakshi News home page

భూంపల్లి ఎస్‌ఐ సస్పెన్షన్‌

Published Sat, May 25 2024 5:40 PM

భూంపల్లి  ఎస్‌ఐ సస్పెన్షన్‌

ఐజీ రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ

పలు కేసుల్లో అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ

దుబ్బాక: భూంపల్లి ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న వి.రవికాంత్‌ సస్పెండ్‌ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం మల్టీజోన్‌ –1 ఐజీ రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మెదక్‌ జిల్లాలోని శివ్వంపేట ఎస్‌ఐగా పనిచేసిన రవికాంత్‌ సిగిల్లాపూర్‌ మామిడి తోటలో జరిగిన దొంగతనం కేసులో, అలాగే పలు భూతగాదా కేసుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు మెదక్‌ జిల్లా ఎస్పీ విచారణ చేయగా నిర్ధారణ కావడంతో సస్పెండ్‌ చేస్తూ ఐజీ రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా 4 నెలల క్రితమే శివ్వంపేట నుంచి బదిలీపై భూంపల్లి ఎస్‌ఐగా వచ్చారు. ఇక్కడా ఆయన పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement