24న జిల్లాస్థాయి సైక్లింగ్‌ ఎంపిక పోటీలు | Sakshi
Sakshi News home page

24న జిల్లాస్థాయి సైక్లింగ్‌ ఎంపిక పోటీలు

Published Wed, Nov 22 2023 4:28 AM

-

అక్కన్నపేట(హుస్నాబాద్‌): ఉమ్మడి మెదక్‌ జిల్లాస్థాయి సైక్లింగ్‌ ఎంపిక పోటీలను ఈ నెల 24న అక్కన్నపేట మండలం రామవరంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జంగపల్లి వెంకట నర్సయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీలు అండర్‌ 14, 17 బాలబాలికలకు మాత్రమేనని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనాలనే క్రీడాకారులు తమ సంబంధిత పాఠశాలల నుంచి జనన ధ్రువీకరణ పత్రాలు, సొంత సైకిలు, హెల్మెట్‌తో హాజరుకావాలన్నారు. క్రీడాకారులకు భోజన సదుపాయం కూడా ఉంటుందన్నారు. ఈ పోటీలో గెలుపొందిన క్రీడాకారులను రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9494876376, 9121588647, నంబర్లను సంప్రదించాలన్నారు.

Advertisement
Advertisement