Sakshi News home page

No Headline

Published Wed, Mar 27 2024 7:35 AM

- - Sakshi

బోరు బావిలో నీరు తగ్గడంతో గంటకు ఒకసారి వెళ్లి బోరు ఆన్‌చేస్తున్నాం. రెండున్నర ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. మరో 25 రోజుల పాటు నీరు అవసరం. ఇప్పుడే బోర్లు వట్టిపోతున్నాయి.

– హాబేద్‌, రైతు, నాగర్‌గూడ

మూడు ఎకరాలలో వరి సాగు చేశా. పదేళ్లుగా బోరు నుంచి సమృద్ధిగా నీళ్లు లభించాయి. కరువు ఉండదని యాసంగిలో పొలం సాగుచేసిన. 15 రోజులుగా బోరు నీళ్లు తక్కువగా పోస్తోంది. వేసిన పంట ఎండిపోతోందని ఆందోళనలో ఉన్నాం.

– అచ్చిని పర్వతాలు, రైతు, అంతిరెడ్డిగూడ

రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నా. మొదట్లో పంట మంచిగా వచ్చింది. రెండు, మూడు తడుల్లో పంట చేతికి వచ్చేది. బోరు వట్టి పోవడంతో పంటను పశువులకు మేపుతున్న. ఏడుపు తప్ప ఏమీ మిగిలేలాలేదు.

– సావిత్రి, రైతు, దేవునిపడకల్‌

రెండెకరాల్లో వరి సాగు చేశా. పంట పొట్టకు వచ్చే దశలో బోర్‌లో నీట్టి మట్టం పడిపోయింది. ఇప్పటికే ఎకరా పంట ఎండింది. మరో ఎకరం కూడా ఎండిపోతోంది. చెరువు మరమ్మతు చేయకే ఈ పరిస్థితి దాపురించింది. అధికారులు స్పందించాలి.

– పద్మనాభాచార్యులు, రైతు, దేవుని పడకల్‌

బోర్లు వట్టిపోతున్నాయి

పంట ఎండుతోంది

ఏడుపే మిగిలింది

ఎకరా పంట ఎండింది

Advertisement

What’s your opinion

Advertisement