ఓటే సామాన్యుడి వజ్రాయుధం

పెద్ద అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ   - Sakshi

అబ్దుల్లాపూర్‌మెట్‌: ‘ఒక్క ఓటు చరిత్ర గతిని మారుస్తుంది. అభ్యర్థుల గెలుపోటముల్లో ప్రతీ ఓటు కీలకమే. అది ఐదేళ్ల పాటు ప్రజల మంచిచెడులను నిర్ధారిస్తోంది. నా ఓటుతో ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం వద్దు.. ఓటే ప్రజాస్వామ్యానికి బలం.. ఓటు హక్కును వినియోగించుకోకుండా మంచి భవిష్యత్తును ఎలా ఊహిస్తాం.. కదలండి ఓటు వేసి బాధ్యత మీదే’ అంటూ జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు గ్రామాల్లో అవగాహన కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సాధారణ ఎన్నికల్లో భాగంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 2018లో జరిగిన ఎన్నికల్లో 65–70 శాతమే పోలింగ్‌ జరగడంతో ఈసారి ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు యంత్రాంగం కసరత్తులు చేస్తోందని ఎన్నికల అధికారి తెలిపారు. ‘పట్నం’ ప్రజలు ఓటు వేసేందుకు ఎంత మేరకు ముందుకు వస్తారో తెలియాలంటే ఓట్ల పండగ వరకు వేచి చూడాల్సిందే.

పోలింగ్‌ శాతం పెంచేందుకు వినూత్న ప్రచారం

Read latest Rangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top